Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నయీంనగర్‌ మరో అమీర్‌పేట్‌

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 02, 2026 7:30 AM వరంగల్తెలంగాణ
నయీంనగర్‌ మరో అమీర్‌పేట్‌ - Udayam Digital
హనుమకొండలోని నయీంనగర్‌ విద్యా సంస్థలకు కేంద్రంగా మారింది. కేజీ నుంచి పీజీ వరకు, పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, వసతి గృహాలతో వేలాది మంది విద్యార్థులతో నిత్యం సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌తో పోల్చే ఈ ప్రాంతంలో దాదాపు 40 వేల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. గేట్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌ సహా పలు పరీక్షలకు ఇక్కడ కోచింగ్‌ అందిస్తున్నారు.

Comments

G
Loading comments...