వార్తలకు తిరిగి వెళ్లండి

భారత నౌకాదళ శౌర్యం, సముద్ర యుద్ధాల చరిత్ర, ప్రాచీన నౌకల పరిణామ క్రమం మరియు ఆధునిక ఆయుధాల సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికి విశాఖపట్నంలోని 'నేవల్ మారిటైమ్ మ్యూజియం' ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఇక్కడ అడుగుపెడితే భారత నౌకాదళ వైభవం, నావికుల సాహసగాథలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి.
విశాఖ ఆర్కేబీచ్‌లోని పామ్‌బీచ్ హోటల్ ఎదురుగా ఉన్న ఈ మ్యూజియం కేవలం పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, విద్యార్థులకు మరియు పరిశోధకులకు సైతం ఒక గొప్ప విజ్ఞాన కేంద్రంగా ఉపయోగపడుతోంది.
Comments
Loading comments...

