వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లి గ్రామం వద్ద రహదారికి ఇరువైపులా ఆకాశాన్ని తాకేలా పెరిగిన భారీ వృక్షాలు ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇరువైపులా దట్టంగా అల్లుకున్న ఈ చెట్లు ఆ ప్రాంతాన్ని ఒక పచ్చని 'హరిత సొరంగం'లా మార్చేశాయి.
ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇక్కడి ప్రకృతి అందాలకు తన్మయులవుతున్నారు. ఒకప్పుడు నాటిన మొక్కలను కొన్నేళ్లుగా ఎంతో జాగ్రత్తగా సంరక్షించడం వల్లే నేడు ఈ అద్భుతమైన పచ్చదనం సాధ్యమైందని స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

