వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మన్యాల సూరిబాబు, ఏడాదిన్నర చిన్నారి అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదంలో గాయపడిన మరో నలుగురిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారు నుజ్జునుజ్జవ్వడంతో డ్రైవర్‌ను యంత్రాల సాయంతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
