వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కింలోని నాథులా మార్గం ద్వారా భారత్–చైనా సరిహద్దు వాణిజ్యం ఆరేళ్లకు పైగా విరామం తర్వాత శనివారం పునఃప్రారంభమైంది. ఇరు దేశాల అధికారులు నో మ్యాన్స్ ల్యాండ్‌లో సమావేశమై వాణిజ్యాన్ని ప్రారంభించారు.
2020లో కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన వాణిజ్యం ఇకపై సోమవారం నుంచి గురువారం వరకు కొనసాగనుంది. నమోదైన ప్రతి వ్యాపారి రోజుకు రూ.2 లక్షల వరకు వాణిజ్యం నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

