వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెదేపా కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని, క్షేత్రస్థాయిలో సమర్థులైన మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని లోకేశ్ పేర్కొన్నారు.
అలాగే, డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని, వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజారెడ్డి రక్తచరిత్ర గురించి జగనే స్వయంగా ప్రస్తావించి ప్రజల్లోకి తీసుకెళ్లారని లోకేశ్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

