వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గడ్కరీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
తన ఎంపీ పదవీకాలంలో విజయవాడ అభివృద్ధికి చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని కేశినేని నాని తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు పలు రహదారి ప్రాజెక్టులకు ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు.
Comments
Loading comments...

