వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ నగరంలో ఇంటింటికి 24 గంటల తాగునీరు అందించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ రూ.296.70 కోట్లతో డీపీఆర్ రూపొందించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును రూపొందించారు.
2053 నాటికి నగర జనాభా 4.19 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

