Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి కాలువ గండి పూడ్చివేత వేగవంతం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 31, 2026 2:06 PM శ్రీకాకుళంGeneral
నాగావళి కాలువ గండి పూడ్చివేత వేగవంతం - Udayam
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నీలాపురం సమీపంలో నాగావళి నది బూర్జ ఓపెన్ హెడ్ ఛానల్‌కు పడిన గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దీంతో సాగునీరు సింగిడి గెడ్డ ద్వారా నదిలోకి వృథాగా వెళ్లకుండా నీటిపారుదల శాఖ ఏఈ దాలయ్య ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. సుమారు 2,500 ఖాళీ సిమెంట్ సంచుల్లో ఇసుక నింపి తాత్కాలికంగా గండి పూడ్చి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...