వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ పట్టణంలోని బొంగుండేశ్వర చౌక్ సమీపంలో మంగళవారం మేకల బజార్ కిక్కిరిసిపోయింది. మేకల విక్రయానికి రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కొనుగోలుదారులు వచ్చారు. శ్రావణమాసం ముగియడంతో విక్రయాలు జోరందుకున్నాయని స్థానికులు తెలిపారు. బజార్ వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

