వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజీపేట మండల కేంద్రంలో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.
వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో విద్యుత్ కోతలు నివారించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు రంగం అస్తవ్యస్తంగా మారిందని నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

