వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లుకుంట- మేకడున గ్రామానికి 4 నెలల క్రితం నిర్మించిన 3 కిలోమీటర్ల తారు రోడ్డు అప్పుడే గుంతలమయంగా మారింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నాణ్యతపై విచారణ జరిపి, నాసిరకం పనులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

