వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నాగోల్‌లోని సాయిరాం నగర్ కాలనీలో వరుణ్ తేజ్ (8), మహేష్ (6) అనే ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. తల్లి మొగిలి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 31న రాత్రి ఇంటికి వచ్చిన ఆమె పిల్లలు కనిపించకపోవడంతో పాఠశాలలో విచారించారు. ఆ రోజు వారు స్కూల్‌కు రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. నాగోల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

