వార్తలకు తిరిగి వెళ్లండి

చల్లపల్లి మండలం నడకుదురు శివారు నాదెళ్లవారిపాలెంలో సోమవారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విక్కుర్తి రాంబాబు పాల్గొని, అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణలో కీలక సేవలు అందిస్తున్నాయని అన్నారు.
అనంతరం పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించి అంగన్వాడీ సిబ్బందిని సత్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

