వార్తలకు తిరిగి వెళ్లండి

లెంకాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్‌ఎస్ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి 16న మృతిచెందగా, చికిత్స పొందుతున్న ఆమె భర్త కస్తూరి రవీందర్ మంగళవారం కన్నుమూశారు. రవీందర్ మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆయన అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

