వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్‌లోని బక్సర్ జిల్లా దుమ్రావ్ ప్రాంతంలో నివాసాల మధ్య ఉన్న 132 అడుగుల భారీ మొబైల్ టవర్, జనరేటర్ అకస్మాత్తుగా మాయమయ్యాయి. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రతినిధి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు ఈ వింత చోరీపై కేసు నమోదు చేశారు.
సదరు స్థల ఒప్పందం 2022లోనే ముగియగా, గత రెండు వారాలుగా టవర్ కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. బక్సర్ ఎస్పీ శుభం ఆర్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

