వార్తలకు తిరిగి వెళ్లండి

లోకకల్యాణం, దేశ–ధర్మ రక్షణను కాంక్షిస్తూ రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలో శ్రీరామ హృదయ కలశ యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా జరిగిన ఈ యాత్రలో భక్తులు“జై శ్రీరామ్”నినాదాలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజలు, భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

