Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తారంలో పేకాట రాయుళ్ల అరెస్ట్.. రూ.3 వేలు స్వాధీనం

Follow Udayam on Google
S kumar Aug 16, 2026 11:11 AM పెద్దపల్లి General
ముత్తారంలో పేకాట రాయుళ్ల అరెస్ట్.. రూ.3 వేలు స్వాధీనం - Udayam
ముత్తారం మండలానికి చెందిన ఓడేడు గ్రామంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. ఓడేడు శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,030 నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...