Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగునీటితో రహదారులు జలమయం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:09 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మురుగునీటితో రహదారులు జలమయం - Udayam
మేడ్చల్ : హబ్సిగూడ వెంకట్‌రెడ్డినగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో కొన్నిరోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి, కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కారణంగా దుర్వాసనతో పాటు దోమలు పెరిగి స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...