వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాళమ్మ కాలనీలో లాక్‌పతి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

