వార్తలకు తిరిగి వెళ్లండి

దస్తురాబాద్ మండలంలోని మున్యాల్ తండాలో నల్ల సంధ్యారాణికి చెందిన 3వ సంవత్సరం ఆయిల్ పామ్ తోటను బుధవారం జిల్లా ఉద్యాన అధికారి రమణ పరిశీలించారు.
ఈ సందర్భంగా తోటల నిర్వహణ, మొక్కల ఎదుగుదల తీరును పరిశీలించి, రైతులకు అందుతున్న సాంకేతిక సహకారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కలను తొలి మూడు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా సంరక్షించుకుంటే, నాల్గవ సంవత్సరం నుంచే ఆశించిన దిగుబడి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

