వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం విధులు బహిష్కరించి బీజేఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు.
ఏసీ గదుల్లో పనిచేసే వారికి ఒకటో తేదీనే జీతాలిచ్చే ప్రభుత్వం, పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న తమపై ఎందుకు వివక్ష చూపుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

