Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైని ముంచెత్తిన రికార్డు స్థాయి వానలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 01, 2026 6:00 PM జాతీయంGeneral
ముంబైని ముంచెత్తిన రికార్డు స్థాయి వానలు - Udayam
దేశ ఆర్థిక రాజధాని ముంబైని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. బుధవారం ఏకంగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. రహదారులు నదులను తలపించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖ ముంబై, పుణే ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Comments

G
Loading comments...