వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జూలై 3 నాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో రానున్న ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. రాబోయే ఐదు రోజుల్లో తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉందని హెచ్చరించారు.
Comments
Loading comments...