Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో వానలు: హైదరాబాద్‌కి విమానాలు మళ్లింపు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 23, 2026 10:06 AM జాతీయంGeneral
ముంబైలో వానలు: హైదరాబాద్‌కి విమానాలు మళ్లింపు - Udayam
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు సహకరించకపోవడంతో పలు విమానాల మార్గాలను దారి మళ్లించారు. సూరత్‌, వారణాసి, దిల్లీల నుంచి ముంబై వెళ్లాల్సిన పలు విమానాలను అధికారులు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికులు తమ విమాన సమయాలను పరిశీలించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...