వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానాల కలకలం

Photo Gallery
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. నేటి ఉదయం 11:30 గంటల సమయానికే ఏకంగా 17 విమాన సర్వీసులు రద్దయినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
అదేవిధంగా, వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 217 విమానాలు తీవ్ర ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆకస్మిక మార్పులతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...