Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో హిమాలయాలు

Follow Udayam on Google
madhu Sep 14, 2026 8:10 PM ములుగుGeneral
ములుగు జిల్లా జంగాలపల్లిని ఆనుకుని ఉన్న రామస్వామి గుట్ట వద్ద వర్షం అనంతరం ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. దట్టమైన మబ్బులు దూది పింజల్లా గుట్టను కమ్మేయడంతో హిమాలయాలను తలపించాయి. చినుకులతో తడిసిన పంటచేలు పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించగా, చల్లని వాతావరణంలో పక్షుల సందడి ఆకట్టుకుంది. గుట్ట పరిసరాల సుందర దృశ్యాలు చూపరులను విశేషంగా అలరించాయి.

Comments

G
Loading comments...