వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల, వ్యవసాయ, విద్య, వైద్య, పోలీస్ శాఖల అధికారులు పాల్గొంటారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

