వార్తలకు తిరిగి వెళ్లండి

రేణిగుంట పంచాయతీ పరిధిలోని బాలాజీనగర్‌లో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లకంపలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యపై స్పందించిన కార్యదర్శి జేసీబీ సాయంతో ముళ్లకంపలు, పిచ్చిమొక్కలను తొలగించి రహదారిని శుభ్రం చేయించారు. సమస్యను పరిష్కరించినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

