వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.
పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రైతులు సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి స్థానిక ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి శోభాయ మానంగా అలంకరించారు.
Comments
Loading comments...

