వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని పీఎంఎస్ ట్రస్టు నిర్వాహకులు పాత్రుని రామకృష్ణ, జిల్లా గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ ఆదినారాయణ శాస్త్రి సూచించారు. సూర్యమహల్ కూడలిలో ట్రస్టు ఆధ్వర్యంలో 500 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో జల కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగి పర్యావరణానికి మేలు చేస్తాయన్నారు.
Comments
Loading comments...

