వార్తలకు తిరిగి వెళ్లండి

సొన్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా మత్స్యకారుల భవనాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ NREGS నిధులు రూ.10 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు.
మత్స్యకార మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ మహిళలకు శిక్షణ, సమావేశాలు, మత్స్య ఉత్పత్తుల నిల్వకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Comments
Loading comments...

