వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న విద్యుత్ తీగలు మృత్యు పాశాలుగా మారి పశువుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కవ్వాల్, హాస్టల్ తండా, బంగారు తండా, కొత్తపేట గ్రామాలలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారి కిందకు వేలాడుతున్నాయి.
భారీ ఈదురు గాలులకు తరచూ విద్యుత్ తీగలు పడిపోవడంతో, వాటిని చూసుకోక పశువులు తొక్కడంతో విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో పశువులు చనిపోతున్నాయని రైతులు వాపోయారు.
Comments
Loading comments...

