వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ మండలం మర్కల్లో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా. ఆస్మా తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
పరిశుభ్రతను పాటించాలని, కాచి వడబోసిన నీటిని తాగాలని, దోమలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

