వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని మరియా తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్ స్మార్ట్ కార్డులు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

