వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో ఇతర ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం గోదావరి నీరు పంట కాలువల ద్వారా పుష్కలంగా అందుతోంది. ప్రభుత్వం సకాలంలో పూడికతీత పనులు చేపట్టడంతో శివారు భూములకూ సాగునీరందుతోంది.
కనుచూపుమేర పచ్చని వరి పొలాలు కళకళలాడుతుండటంతో రైతన్నల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తాడేపల్లిగూడెం జాతీయ రహదారి పక్కన పచ్చటి ప్రకృతి అందాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

