వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా గురుజాలకు చెందిన ఓ మహిళ భార్యాభర్తల గొడవ నేపథ్యంలో ఏడాది వయసున్న పాపను బుధవారం మంత్రాలయం శ్రీమఠం వద్ద వదిలివెళ్లింది. భర్త ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఎస్సై మల్లికార్జున పాపను స్వాధీనం చేసుకుని, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమిత్రమ్మ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నచిన్న గొడవలకు పిల్లలను వదిలివేయొద్దని ఐసీడీఎస్, పోలీసు అధికారులు సూచించారు.
Comments
Loading comments...

