Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోర్గిలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Follow Udayam on Google
బాలాజీ Aug 07, 2026 6:06 PM సంగారెడ్డిGeneral
మోర్గిలో ఘనంగా బోనాల ఉత్సవాలు - Udayam
మండలంలోని మోర్గి గ్రామంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఎత్తుకొని మరియమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పోతురాజుల విన్యాసాలు, భక్తుల నృత్యాలతో సందడి నెలకొంది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మోర్గి గ్రామ సర్పంచ్ మల్గే అన్నపూర్ణమ్మ శివశరణప్ప, మాజీ ఎంపీటీసీ కీర్తి నందు పటేల్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...