వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురారం మండలంలోని దుగ్గేపల్లి, లక్ష్మీపురం, కామారెడ్డిగూడెం, కోనతలపల్లి ప్రాంతాల్లో వందలాది కోతులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రహదారుల వెంట కోతుల బెడదతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు కోతుల నుంచి తప్పించుకుని ప్రయాణించేందుకు నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కోతులను పట్టించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

