Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలతోనే అందరికీ భవిష్యత్తు

Follow Udayam on Google
p.g.murthy Aug 12, 2026 4:20 PM మంచిర్యాలGeneral
మొక్కలతోనే అందరికీ భవిష్యత్తు - Udayam
మొక్కలతోనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట అటవీశాఖ డిఆర్ఓ సాగరిక స్పష్టం చేశారు. వన సంరక్షణలో భాగంగా బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడంలో మొక్కలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి మొక్క భవిష్యత్తుకు పునాది లాంటిదని, అందరూ మొక్కల సంరక్షణకు నడుం బిగించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Comments

G
Loading comments...