Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ట్రిపుల్‌ ఐటీలో మొబైల్ ఫోన్లపై ఆంక్షలు

Follow Udayam on Google
Parvathi Jun 22, 2026 5:03 PM బాసరGeneral
బాసర ట్రిపుల్‌ ఐటీలో మొబైల్ ఫోన్లపై ఆంక్షలు - Udayam
విద్యార్థుల ఏకాగ్రతను పెంచేందుకు బాసర ట్రిపుల్‌ ఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తరగతి గదులు, లైబ్రరీలు, మెస్ తదితర ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని యాజమాన్యం పూర్తిగా నిషేధించింది. మొబైల్ ఫోన్ల అతి వినియోగంతో విద్యార్థుల చదువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనలు అమలులోకి తెచ్చారు. క్యాంపస్‌లో క్రమశిక్షణను కాపాడటమే తమ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...