వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్య పురస్కరించుకుని మంగళగిరి కొండపై గండాలయ స్వామి ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో సిబ్బంది ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.
దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

