వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో టూటౌన్ పరిధిలోని హమాలివాడ, తిలక్ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో గొడవలకు పాల్పడే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ ప్రమోదరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

