వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని హనుమాన్వాడ ప్రాంతంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. బొక్కల మహేందర్ (38) తన ఇంట్లోని మంచినీటి నల్లా గుంతలో తలకిందులుగా పడి మృతి చెందారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీశారు.
ఘటన అనంతరం మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

