వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఐలమ్మ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొరల అహంకారాన్ని ఎదిరించి పేదల హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పోచంపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు మంద రమేష్, కనగర్తి నరేష్, కోరేపు భూమేశ్వర్, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

