Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లపరాజుపేటలో అంగన్వాడీ వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:01 PM ఏలూరుGeneral
మల్లపరాజుపేటలో అంగన్వాడీ వేడుకలు - Udayam
గణపవరం మండలం ఏ. గోపవరం సెక్టార్‌లోని మల్లపరాజుపేట అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి యాళ్ల సుబ్బారావు అన్నారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...