Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లేశ్వరాలయంలో శ్రావణ శోభ

Follow Udayam on Google
Naresh Aug 31, 2026 4:08 PM నిర్మల్General
మల్లేశ్వరాలయంలో శ్రావణ శోభ - Udayam
కుబీర్ మండలంలోని పురాతన మల్లేశ్వర శివాలయం శ్రావణ సోమవారం పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించడంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా సిర్పెల్లి తండాకు చెందిన పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...