మల్లేపల్లి ప్రీమియర్ లీగ్-3 విజేత దేవరకొండ జట్టు

కొండమల్లేపల్లిలో నిర్వహించిన మల్లేపల్లి ప్రీమియర్ లీగ్-3 క్రికెట్ టోర్నమెంట్‌లో దేవరకొండ జట్టు విజేతగా నిలిచింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ విజేత, రన్నరప్, మూడో స్థానం జట్లకు బహుమతులు అందజేశారు.
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, గ్రామీణ ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
