వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా విన్నారు.
ఈ సందర్భంగా మొత్తం ఐదు దరఖాస్తులు అందగా, నాలుగు ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించిన సమస్యలపై, ఒకటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినదిగా అధికారులు తెలిపారు. సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

