Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 05, 2026 12:26 PM కర్నూలుGeneral
ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు - Udayam
జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామివారిని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మంగళవారం దర్శించుకున్నారు. చిన్ననాటి మిత్రుడు ఈరన్న శెట్టితో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఎమ్మెల్సీ స్వామివారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...